బాలగెయం: -సత్యవాణి


 గాడిద నెందుకు అవమానించుట

ఘనమగు జంతువు అదికాదా

పొట్టిది అయినా

గట్టిది బలమున

మోయును బరువులు

సులభంగా

చాకలి బట్టల మూటలు మోయుచు

చేయునుసాయం చెప్పకనే

రైతుకు కూడా చేయును సాయం

పంటల మూటలు ఇంటికి చేర్చి

సైనిక వీరుల సాదర దినుసులు

కొండల పైకిని చేర్చునులే

పనికి రానిదని గాడిదననకుడు

పాపంకలుగును తప్పకను

పనిదొంగలతో పోల్చబోకుడు

పాపము గాడిద చింతించు