ఏక రధ చక్రవర్తి ....:---మొహమ్మద్ అఫ్సర వలీషా--ద్వారపూడి (తూ గో జి)


 అదితి కస్యపుల పుత్రుడా

ప్రకృతి లోని అన్ని జీవరాసులకు మిత్రుడా....


మకర రాశి మరలి

మయూఖాలు పుడమి 

దరి తరలి....


మాఘ శుధ్ధ సప్తమి రధ సప్తమి

మనోహర రూపుడైన జయుంతుని 

జన్మ దిన పున్నమి.....


ఏక చక్ర రధ సారుడు

ఏడు గుర్రాల ప్రచండ భానుడు....


పశ్చిమకు పయనిస్తూ 

ప్రవచనాలు హనుమకు

యజ్ఞవల్కుయుడికి బోధిస్తూ...


సూర్యజయంతి ముందు రోజే ఏకభుక్తాచరణ 

సూరీడు  రాకముందే  అరుణోదయాన దీపారాధనాచరణ....


అర్క పత్రం బదరీ ఫల స్నానం

ఆరోగ్యాల సౌరశక్తి సుసంపన్నం 

అక్షితలు , కెంజాయ వర్ణ వస్త్రధారణం....


తరిగిన కూరలు నిషిద్ధం 

తులసి కోట దగ్గర పరమాన్నం సంసిద్ధం

తూర్పు దిక్కున తులసికి నివేదనం....

  

చిక్కుడుతో రధాల చిత్రం 

చిత్తశుద్ధి తో చిత్ర రధ స్వామికి 

ఛాయ పద్మ సంధ్య లకు మనస్ఫూర్తి చిత్తం....


వెలుగుల పుడమికి 

నీ పునరుత్తేజం అద్దాలి

సకల జనుల సుఖశాంతులకు

నిలయం కావాలి....


అజ్ఞాన తిమిరాన్ని తరిమి

జ్ఞాన జ్యోతులు నింపాలి 

అట్టహాసంతో జరిపే నీ జన్మ దినాన్ని

ఆద్యంతం నీవు చూడాలి.....!!