అక్షరమాలికలు--డా.రామక కృష్ణమూర్తి--బోయినపల్లి,సికింద్రాబాద్.


 ఏకపది:(రాత్రి)

*******

1.ఆకాశాన నక్షత్రాలతో_చంద్రుడు వెలిగే వేళ.

2.నీలమైన ఆకాశంలో_ వెన్నెల వెలుగులు నిండిన జాము.


ద్విపదం:(చదువులు)

********

1.విజ్ఞానాన్ని అనుస్యూతంగా అందించేవి.

జ్ఞానప్రసారాన్ని నిరంతరం చేసేవి.

2.ఉపాధులకు ఆదరువై నిలిచేవి.

సంస్కారం,వినయాలను పెంపొందించేవి.


త్రిపదం:(కుగ్రామం)

*******

1.మారుమూల ప్రాంతంలో ఉండే స్వచ్ఛమైన పల్లెటూరు.

అభివృద్ధికి నోచుకోని గ్రామీణ పల్లె.

చాలా దూరంగా ఉండే అసౌకర్యాల జానపదం.

2.మట్టిదారుల గుండా లోనికి ఉండే గ్రామం‌.

ఆధునికత అంటని చిన్న ఊరు.

జనాభా తక్కువగా ఉండే చిన్న నిలువరం.


చతుర్థపదం:(పాఠశాల)

***********

1.విద్యను అందించే సరస్వతీ ఆలయం.

ఆటపాటలతో ఆకర్షించే విద్యాలయం.

పిల్లలందరినీ అమ్మలా ఆదరించే బడి.

చదువుల సారాన్ని అందించే ఒడి.

2.శిశుదశ నుండి యుక్తదశ దాకా మనలను తీర్చిదిద్దే ఆలయం.

అధ్యయనం,అభ్యాసాలను క్రమపద్ధతిలో చేయించే ప్రయోగాలయం.

శారీరక,మానసిక వికాసాలకు దోహదం చేసేది.

క్రమశిక్షణ,బాధ్యతలను నేర్పేది.