కుంకుమ పువ్వులు :-- ఎం. వి. ఉమాదేవి.


 కుంకుమ పువ్వుల సుందర కాశ్మీరమా, 

వీరులు కుంకుమ పువ్వల వలే 

రాలిపోయిరమ్మా !

దేశ మహిళల కుంకుమ కాపాడు ధీరులు, 

రెప్పపాటున కనుమరుగైన కలలు !


కంటిపాపలను దేశానికి అర్పించిరి ఆ తల్లులు, 

శోక భారమున కేవమ్మా ఎల్లలు!

కుంకుమ రాలిన జీవితసహచరి అశ్రువులు, 

ఘనీభవించి హిమగిరులై 

నిలుచునేమో !


ఎదురుచూపులే మిగిలినవే 

బెదురు చూపుల బిడ్డలకు 

బాల్యంలో, 

జెండా కప్పిన నిలువెత్తు అనురాగం దిగ్భ్రమగా !


ఆఖరి ఆరడుగుల నేలకొఱకు 

దురాక్రమించుటేలా, 

దుష్కర కర్మలేలా...?? 

రాలిపోయినా,వాడిపోయినా 

అమూల్యమీ కుంకుమపువ్వులు!


అంజలి చేకొనుడు వీరజవాన్ 

లారా!

భరతమాత గర్వించు ముద్దు 

బిడ్డలారా !!