బదిలీ ...!!;-------డా.కె .ఎల్వీ .హన్మకొండ .


 ఇది నిజమేనంట ,

అప్పుడు ....

టెలిగ్రాము ఉండేదట 

అర్జన్టు సమాచారం 

' మోర్స్ కోడ్ ' తో 

పంపేవారట ....!


పోస్టాఫీసు ద్వారా 

మని ఆర్దరు సౌఖర్యం 

ఉండేదట ....

ఒకచోటునుండి -

మరోచోటికి 

డబ్బు పంపే 

అవకాశం ఉండేదట !


ప్రతి వేడుకకు -పండుగలకు 

పరస్పరం అందించుకునే ,

అంద మయిన..

గ్రీటింగు కార్డులు ఉండేవట !


దూరానవున్న 

బంధు మితృలతో 

శ్రేయోభిలాషులతో 

మాట్లాడుకునే ...

ట్రంకాల్ ..

సదుపాయామ్ ఉండేదట 


దానికోసం ...

గంటలతరబడి ...

క్యూలో నిలబడేవారట !


ఇప్పుడు -అవన్నీ 

గతంలోకి చేరిపొయాయి !

ఆధునికంగా ...

మొబైల్ జాబితాలో 

చేరువయ్యాయి   ....!!


----------------------------------         


ఫోటోలో....బేబి  ఆన్షి .నల్లి.