ఏనుగు: --డా.కందేపి రాణి ప్రసాద్

 ఏనుగమ్మా !ఏనుగు
నల్లని ఏనుగు
ఎగరలేని ఏనుగు !ఎత్తైన ఏనుగు
చిన్ని కళ్ళున్న ఏనుగు!చేట చెవుల ఏనుగు
చెట్లు వీరిచే ఏనుగు! చల్లని నీళ్లలో ఏనుగు
లక్ష్మీదేవికి ప్రియమైన ఏనుగు
లంబోదరుడి శిరస్సుగా ఏనుగు
పాలిచ్చి బిడ్డను చక్కగా పెంచే ఏనుగు
పదికాలలు గర్భంలో మోసే ఏనుగు
అంగుళం మందం చర్మమున్న ఏనుగు
దేవుడి ఊరేగింపులో ఉత్సవ ఏనుగు
దళంగా రాజుల యుద్ధాలలో ఏనుగు 
మోసలికి నీటిలో చిక్కిన ఏనుగు
మోక్షాన్ని పొందిన గజేంద్ర ఏనుగు!