తువ్వాయి తువ్వాయి:-సత్యవాణి


 ఓబుజ్జి తువ్వాయీ

హవ్వాయి చువ్వల్లే తువ్వాయీ

గెంతకే నీవలా తువ్వాయీ

పట్టలేనే నిన్ను తువ్వాయీ

పరుగు లాపవె నీవూ తువ్వాయీ     ॥॥


అమ్మ ఒడలూ నిమిరి

గుమ్మపాలను యివ్వ 

కమ్మగా గుడిచేవే తువ్వాయీ                

పొదుగూ కుమ్ముతూ  కుడిచేవే తువ్వాయీ            

పాలను కమ్మగా తాగేవే తువ్వాయీ           ॥॥

               

చిట్టిమువ్వలు మోగ 

చిందులేస్తూ నువ్వూ

పెరడంత  పరిగెడితె తువ్వాయీ

నిన్ను పట్టలేకున్నానే  తువ్వాయీ 

నేనూ కట్టబోనూ నిన్ను తువ్వాయి        ॥॥


నా మంచి నేస్తమనీ

నా జట్టు వుంటావనీ

మూతి చిక్కమిప్పేనెే తువ్వాయీ

మురిపించకే నన్నూ తువ్వాయీ              

ముద్దు పెడుదునురావెే తువ్వాయీ