కానుగ చెట్టు ఆకులలో అల్ట్రా వైలెట్ రేస్ ను తట్టుకునే శక్తి ఉంటుంది. నీడనిచ్చే చెట్లలో ఇది ప్రముఖమైనది. రోడ్లకు ఇరువైపులా మనకు ఈ చెట్లు కనపడుతుంటాయి. ఇది విష క్రిములను కూడా అడ్డుకుంటుంది. ఇది యాంటీ ఫంగల్ లక్షణాలు కలిగి ఉంటుంది.ఒంటి నొప్పులు ఎక్కువైనప్పుడు కానుగ ఆకులను మరిగించి నీటిలో కలుపుకొని స్నానం చేస్తే ఒంటి నొప్పులు పూర్తిగా తగ్గిపోతాయి. అందులో పసుపు కూడా వేసి స్నానం చేస్తే దురదలు తగ్గిపోతాయి.కానుగ గింజలను పొడిగా చేసి నీటిలో వేసి మరిగించి తాటి కలకండ కలిపి తాగితే మోకాళ్ళ నొప్పులు కీళ్ల నొప్పులు తగ్గిపోతాయి. దీనితో సొరియాటిక్ ఆర్థరైటిస్ కూడా తగ్గిపోతుంది.. కానుగ తో తయారుచేసిన నెయ్యి కూడా ఆయుర్వేద షాపుల్లో దొరుకుతుంది.[17/2, 2:56 am] Kam Anna: దీన్ని వాడితే శరీరంపై ఎర్ర మచ్చలు కూడా తగ్గిపోతాయి. పుళ్ళు తగ్గడానికి కూడా కానుగ నెయ్యి బాగా పనిచేస్తుంది.కొన్ని కానుగ పూలను సేకరించి శుభ్రంగా కడిగి నీటిలో వేసి మరిగించి జిలకర కూడా కలిపి చల్లార్చి తాగితే మధుమేహ వ్యాధి తగ్గుముఖం పడుతుంది.
కానుగ చెట్టు - ఉపయోగాలు....: పి . కమలాకర్ రావు