సతీసావిత్రి.:--డా.బెల్లంకొండనాగేశ్వరరావు.చెన్నయ్.

 మద్రదేశాన్ని అశ్వపతి అనేరాజు పరిపాలిస్తుండేవాడు.అతనిభార్యపేరు మాళవి.ఆదంపతులు సంతానంకొరకు జగన్మాత అవతారంలోని 'సావిత్రి'దేవిని ప్రార్ధించి కుమార్తెనుపోందారు ఆమెపేరు సావిత్రిగా పెట్టి పెంచారు.నారదమహర్షిద్వారా సాళ్వదేశపు రాజు ద్యుమత్సేనుని కుమారుడు అయిన 'సత్యవంతుని ప్రేమించింది. ఆవిషయంతెలుసుకున్న ఆమెతండ్రి అశ్వపతి నారదిమహర్షిని సత్యవంతునిగురించి వివరాలుఅడిగాడు.'సత్యవంతుని అసలుపేరు చిత్రాశ్వుడు ఎప్పుడూ సత్యమేపలుకుతాడుకనుక అతన్ని సత్యవంతుడు అనిపిలుస్తారు.అతను నీకుమార్తెకు తగినవరుడే కాని అల్పయుష్కుడు.అతనుఒక సంవత్సరకాలమే జీవిస్తాడు.అతనితండ్రి అంధుడు రాజ్యభ్రష్ఠుడు.భార్యాపిల్లలతో అడవులలో నివసిస్తున్నాడు.ఆపైనమీఇష్టం అన్నాడు నారదుడు.సావిత్రి పట్టుదలవలన అశ్వపతి  ద్యుమత్సేనుడివద్దకు వెళ్లి సత్యవంతునితో తనకుమార్తె వివాహంజరిపించమని వేడుకున్నాడు."రాజానేను అంధుడను. రాజ్యంకోల్పోయినవాడను.ఇలాఅడవులలో తపస్సు చేసుకుంటూ బ్రతుకుతున్నాను.నాకుమారునివివాహంచేసుకుని నీకుమార్తె ఏంసుఖపడుతుంది.రాజపుత్రిక భోగాలకు అలవాటు పడిఉంటారు,ఇక్కడనేలపైనిద్రించగలదా,కందమూలాలు భుజించగలదా"అన్నాడు వారినిఒప్పించి వివాహం జరిపించాడు అశ్వపతి.అలామహాపతివ్రత,సకలగుణసంపన్నురాలుగా సావిత్రి పేరుపోందింది.సావిత్రి నియమనిష్ఠలతో భగవంతునిపూజిస్తు,వ్రతదీక్షతో సత్యవంతుని వెంటే ఎప్పుడుఉండేది.ఒకరోజు దంపతులు అడవిలో సమిధలు సేకరిస్తుండగా,యముడు సత్యవంతుని ప్రాణాలు తీసుకుని వెళుతుండగా,అతన్నివెంబడించింది.అమెపట్టుదలకుమెచ్చిన యముడు నీపతిప్రాణాలుతప్ప ఏదైనా వరంకోరుకోఅన్నాడు.మామగారికి దృష్టి,రాజ్యముకోరుకుంది.అయినా వెంటరావడంతో నీపతిప్రాణాలుతప్ప మరేదైనా వరంకోరుకో అన్నాడు.తనతండ్రికి కుమారుని ప్రసాదించమనివేడుకుంది.అనుగ్రహించినప్పటికి వెన్నంటిరావడంతో నీపతిప్రాణాలు తప్ప వేరే ఏదైనా వరంకోరుకో అన్నాడు.నాకుసంతానం ప్రసాదించండిస్వామి అంది.తధాస్తూ అన్నయముడు ముందుకు కదిలాడు.స్వామి భర్తలేకుండా నాకు సంతానం ఎలాకలుగుతుంది అనడంతో సత్యవంతుని బ్రతికించి ఆశీర్వదించి మరలిపోయాడు యముడు.