గీతలు: -- డా.గౌరవరాజు సతీష్ కుమార్.


 గీతలు గీతలు

పిచ్చి గీతలా ?

కావవి కావవి

అవి మా పాపాయి

రాతలు రాతలు !


రాతలు రాతలు

పిచ్చి రాతలా ?

కావవి కావవి

అవి మా పాపాయి

అక్షరాలు అక్షరాలు !


అక్షరాలు అక్షరాలు

లెక్కకుమించి అక్షరాలు

పనికిరానివా ?

కావవి కావవి

అవి మా పాపాయి

ఏరి కూర్చిన పదాలు !


పదాలతోనీ వాక్యాలు

వాక్యాలతోనీ విషయాలు

అన్నీ నేర్చింది పాపాయి

అన్నీ రాసింది పాపాయి

మా మంచి పాపాయి

మా ముద్దు పాపాయి !!