అమ్మమ్మ కథలేవి?:--మంజీత : బెంగుళూరు

 అనగనగనగా అంటూ మొదలు

కలల లోకంలోకి తీసుకెళ్ళు


అమ్మమ్మ ఒడిలో విన్న కథలెన్నో

చందమామను చూసి మురిసిన రోజులెన్నో


అమ్మ గోరు ముద్దలు పెడుతుంటే

తీయగా సాగే అమ్మమ్మ కథలు


రాత్రి కాగానే అమ్మమ్మ చెంతన

విన్న పంచ కళ్యాణి కథలు


ఏవీ ఆ కమ్మని కథలు

ఏమయ్యాయి ఆ వెన్నెల రాత్రులు


అంతరించాయమ్మ అమ్మమ్మ కథలు

టీవీలకే దాసోహమయ్యే నేటి బతుకులు


కంప్యూటర్స్, మొబైల్స్...

పిల్లల చేతిలో టెక్నాలజీ


కథలు వినే ఆసక్తి లేదు

అమ్మమ్మ కోసం సమయం లేదు


వీడియో గేమ్స్ తో ఆటలు

లాప్టాపే లోకం 

గడప దాటని బాల్యం


ఇదీ నేటి దుస్థితి

మారాలి ఈ పరిస్థితి


నీతి కథలు తెల్సుకొని మసులుకో

జీవిత పాఠాలు నేర్చుకో