నాట్యమాడగ తెలుగు:-సి.యస్. రాంబాబు


 అమ్మ నేర్పిన మాట 

నాన్న చూపిన రాత

మరువొద్దు సోదరా 

మనతెలుగు మనకీర్తి


తేనెలూరే తెలుగు 

ఇంటికే వెలుగు 

మనభాష మనశ్వాస

మనకెపుడు అండ 


నన్నయ్య తిక్కన్న 

ఎర్రన్న వేమన్న 

శ్రీనాధ పోతనలు 

ఉగ్గుపోసిన భాష 


తెలుగింటి దీపమై

తెగువనే చూపరా

తెలుగు నేర్చిననాడు

బతుకంత పండగ 


పలుకు బంగారమే 

మనసు మందారమే 

నాట్యమాడెను తెలుగు 

మనకంటి వెలుగై


(ఈరోజు అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం)