35 సంవత్సరాల క్రితం. స్కూల్లో టీచర్ నన్నో ప్రశ్న వేశారు.కృష్ణుడికీ కన్నయ్యకూ ఉన్న తేడా ఏంటీ?దీనికి నేనిచ్చిన జవాబు....రెండిటికీ వయస్సే తేడా అని!చిరు ఉదాహరణ....ఒకరోజు నేను....ముఖమంతా సబ్బు పులుముకుని స్నానం చేస్తున్నానుఉన్నట్లుండి పక్కనే ఉంచుకున్న నీటి చెంబు కనిపించలేదు.కళ్ళు తెరవలేక రెండు చేతులతో నా చుట్టూ వెతికాను.అప్పుడు నా బిడ్డ నవ్వుతున్న శబ్దం వినిపించింది.నాకు విషయం బోధపడింది.చెంబుని ఆమె దాచినట్లు అర్థమైంది.నా కళ్ళు మండుతున్నాయన్నది బిడ్డకు తెలియడం లేదు.నేను చెంబు వెతకడంలో ఆమెకో ఆనందం.ఇది బిడ్డి కొంటెతనం.ఇప్పుడు ....నా కంట్లో రవ్వంత దుమ్ము పడ్డాసరే ఆమె కళ్ళు కన్నీళ్ళు కారుస్తాయి.రెండింటికీ తేడా వయస్సే మాత్రమే.మహాభారతంలో కృష్ణుడు చిన్నవాడుగా ఉన్నప్పుడు గోపికల వస్త్రాలను దాచి పెట్టి వారు వెతుకుతుండటం చూసి ఆనందించాడు.అదే కృష్ణుడు కన్నయ్యగా మారినప్పుడువస్త్రాపహరణ ఘట్టంలో ఓ స్త్రీకి చీరందించి ఆమె మానాన్ని కాపాడాడు.రెండిటికీ తేడా వయస్సు మాత్రమే.కృష్ణుడు చిన్న పిల్లాడుగా ఉన్నప్పుడుమిత్రులతో కలిసి ఇరుగుపొరుగు ఇళ్ళల్లోని వెన్నను దొంగిలించి తిన్నాడు. అమ్మ అడిగినప్పుడు నేను దొంగిలించనే లేదని అబద్ధం చెప్పాడు.అదే కృష్ణుడు కన్నయ్యగా మరినప్పుడు దొంగతనం కూడదని, అబద్ధం చెప్పకూడదని ఉపదేశించాడు.రెండిటికీ తేడా వయస్సే...గమనికఇది తమిళంలో చదివిన విషయం. ఓ మిత్రుడు వాట్సప్ లో నాకు పంపగా అది చదివి తెలుగులో రాశాను. తమిళంలో ఎవరు రాశారో పేరు తెలీలేదు. విషయం బాగుంది కదాని రాశానంతే.
రెండింటికీ తేడా వయస్సు మాత్రమే: -- యామిజాల జగదీశ్