మినీలు : జగదీశ్ యామిజాల


 ఏదో ఒకటి రాయాలి

ఎవరో ఒకరు చదివేలా రాయాలి

చదివి ఆస్వాదించేలా రాయాలి

ఇది ఎందుకొచ్చిన ఆశో తెలీక

ఎందుకో రాస్తూనే ఉన్నా

రవ్వంతైనా ప్రయోజనం లేని

పనికిరాని మాటలు

నాకైనా నీకైనా అని తెలుసు

కానీ

ఊరుకోకుండా

అక్షరాలతో ఎందుకొచ్చిన బంధమో

నాకు....

ఏడు పదులకు దగ్గరపడుతున్నా 

తెలీడం లేదు నా మట్టిబుర్రకు

-------------------------------

పొందే ప్రేమ కన్న

పంచే ప్రేమే మిన్న\