అంబాలిక-అంబిక(పురాణపాత్రలు)డా.బెల్లంకొండనాగేశ్వరరావు.చెన్నై.


 అంబికసోదరిమణులు వీరు స్వయంవరంలో రాజులు అందరిని జయించి శంతనమహారాజు సత్యవతి తనయులు తన తమ్ములైన విచిత్రవీరుని,చిత్రాంగదుల కొరకు కాశీరాజ్యంనుండి హస్తినాపురానికి అంబిక,అంబాలిక లనుతీసుకువచ్చిన భీష్ముడు,అంబాలికను విచిత్రవీర్యునికి ఇచ్చి వివాహంజరిపించాడు.అతనుక్షయవ్యాధికిలోనై సంతానహీనుడుగా మరణిస్తాడు.చిత్రాంగదుడుసంతానహీనుడిగా తనపేరేకలిగిన గంధర్వరాజుతో యుధ్ధంచేస్తూ మరణిస్తాడు.వివాహానికిముందే పరాశరమహర్షివలన జన్మించిన వ్వాసుని తలచుకున్నది సత్యవతి.వ్యాసమహర్షుద్వారా  దేవరన్యాయంతో నావంశాన్ని నిలబెట్టు అనివేడుకుంది.అంగీకరించిన వ్యాసుడు అంబికతో కూడగా ఆమెభయంతో కళ్లుమూసుకుంది.ఆకారణంగా ఆమెకు అంధుడు అయిన ధృతరాష్ట్రడు జన్మించాడు.అలానే అంబాలిక తోకూడగా కంపిత శరీరంతో పాలిపోయిన విధానప్రవర్తించడంతో పాండువ్యాధి పుత్రుడుపాండురాజు కలిగాడు.మరలఅంబికనుపంపగా,తనబదులు దాసిని వ్యాసునివద్దకు పంపడంతోఆదాసికి విదురుడు జన్మించాడు.పెరిగిపెద్దవాళ్లయిన పాండురాజుకు యదువంశీయుడైన శూరసేనునికుమార్తె కుంతిభోజుని దత్తపుత్రిక కుంతిని ఇచ్చి వివాహం జరిపించారు.అలానే మాద్రిదేశాధిపతి శల్యుని సోదరి మాద్రినికూడా ఇచ్చివివాహంజరిపించారు.అలానే ధృతరాష్ట్రనికి గాంధారరాజు సుబలునికుమార్తె గాంధారితో పాటు ఆమెసోదరీమణులు పదిమందితో వివాహం  జరిపించారు.ధృతరాష్ట్రనికి మరొక భార్యవలన యయుత్సుడు అనేకుమారుడు జన్మించాడు.