మణిమంతునికి- అగస్త్యునిశాపం:-.డా.బెల్లంకొండనాగేశ్వరరావు.చెన్నై .

 అగస్త్యుడువిదర్బదేశరాజకుమార్తెఅయిన'లోపాముద్ర'నువివాహంచేసుకున్నాడు. సమస్త రాజ ఆభరణాలు తన తల్లి తండ్రులకు అప్పగించి,నారచీరలు ధరించి అగస్త్యుని వెంట నడచింది లో పాముద్ర.తనతపస్సుచే భార్యకు ఎటువంటి అలంకార ఆభరణాలు ఇవ్వకూడదు అని నిర్ణయించుకుని,'శృతర్వుడు'అనేరాజునుధనం అడిగాడు.ఆరాజుతనవద్దలేదుఅనడంతో,తననుఅనుసరించమని'బ్రధ్నశ్వుడు' అనేరాజువద్దకువెళ్ళారు.అతనుకూడా ధనంలేదు అనేసరికి,ముగ్గురుకలసి 'త్రసదస్యుడు'అనేరాజువద్దకు వెళ్ళారు.అతనూధనంలేదనడంతో,నలుగురుకలసి వెళ్ళిగా,మేకరూపంలో ఉన్న వాతాపినిభోజనంలోనికి చంపి అతని సోదరుడు వండిపెట్టగా ఆరగించి'జీర్ణంజీర్ణంవాతాపిజీర్ణం'అన్నాడు.తనసోదరుడు మరణించడంతో భయపడిన 'ఇల్వలుడు'అగస్త్యునకు పెద్దమొత్తంలో ధనం ఇచ్చాడు.ఆధనంఅంతాభార్యకు ఇచ్చి,యమునానదీ తీరంలో అగస్త్యుడు  ఊర్ధ్వబాహుడై తన తలపై రెండు చేతులు దోసిలి ఆకారంలో నిలువుగా ఉంచుకుని తపస్సుచేయసాగాడు.అదేసమయంలో గంధర్వరాజైన కుబేరుడు,తనమిత్రుడైని మణిమంతుని తోకలసి తనపుష్పకవిమానంలోఆకాశమార్గానప్రయాణంచేస్తుండగా, మణిమంతుడు తాంబూలాన్ని పైనుండి క్రిందికి ఉమ్మివేసాడు.అది అగస్త్యుని పై పడింది.ఆగ్రహించిన అగస్త్యుడు 'కుబేరా నీమిత్రుడు గంధర్వుడు అనే గర్వంతో మాలాంటితపోదనులను అవమాన పరచాడు,అతను ఓమానవుడి చేతిలో మరణింస్తాడు' అనిశపించాడు,
అనంతరం మహాభారత కాలంలో పాండవులు అరణ్యవాసం చెస్తున్న సమయంలో దివి లోని 'సౌగంధికాపుష్పం'భీముడు ద్రౌపతిలముందు పడింది.ద్రౌపతి కోరికపై మరిన్ని పుష్పాలు తేవడానికి భీముడు బయలుదేరి హనుమంతుని సహాకారంతో కుబేరుని నగరం 'అలకాపురం'చేరి సౌగంధికపుష్పాలవనానికి కావలిగా ఉన్న మణిమంతుని తో పోరాడి అతన్ని సంహారించిన భీముడు సౌగంధికాపుష్పాలను తీసుకుని భూలోకంచేరి ద్రౌపతికి అందజేసాడు.