ఏనుగు:-:- డా.గౌరవరాజు సతీష్ కుమార్.

 ఏనుగు బాబు ఏనుగు
మా ఇంటికి వచ్చింది ఏనుగు
నలుపు రంగు ఏనుగు
నాలుగు కాళ్ళ ఏనుగు
తొండం కలిగిన ఏనుగు
చిన్ని తోక ఏనుగు
దేవుని సవారి ఏనుగు
అరటిపండు తింటుంది ఏనుగు
చెరుకుగడలు తింటుంది ఏనుగు
శాకాహారి ఏనుగు
గణపతి ముఖము ఏనుగు
దండం పెట్టాలి మనమూ !!