అరటి పండు:-డా.కందేపి రాణి ప్రసాద్


 అరటిపండు అరటిపండు

ఆరోగ్యానికి  అరటిపండు

పోషకాలకు అరటిపండు

పౌష్టికానికి అరటిపండు


అందమైన అరటిపండు

తియ్యనైన ఆరటిపండు

పచ్చనైనా అరటిపండు

పసిపిల్లల అరటిపండు


చవకగా దొరికే పండు

తేలికగా జీర్ణమయ్యే పండు 

మెత్తని గుజ్జుగల పండు

పళ్ళులేకున్నా తినే పండు


ఏనుగు ఇష్టపడే పండు

కోతి మెచ్చి తినే పండు

గెలలుగా కాసే పండు

దజన్లుగా అమ్మే పండు


మిల్క్ షేక్ లో అరటిపండు

స్వీట్ లస్సిలో అరటిపండు

నైవేద్యాలకు అరటిపండు

తాంబూలాలకు అరటిపండు