కాఫీ..(బాలగేయము): -అంజయ్యగౌడ్

 వేడివేడి తేనీరు
వేకువనే త్రాగేరు
పాలుకాఫి డికాషన్
పసందైన లొకేషన్
చిన్నపెద్దలందరు
ముచ్చట్లు పెడుదురు
చిటికెలేస్తు కొందరు
గుటకలేస్తు ఉందురు
ఇందుగలదు అందులేదు
సందేహము వలదటంచు
సందుగొందు మలుపుల్లో
చౌరస్తా సెంటర్లో
బస్టాపులు సినిమాలు
ఆఫీసులు అంగడులు
రైలులోన ఫ్లైటులోన
రహదారుల కిరుప్రక్కన
దొరుకుతుందిరా కాఫీ
త్రాగితె పెరుగదు బీఫీ