భృగుమహర్షి(పురాణకథ):- డా.బెల్లంకొండనాగేశ్వరరావు.


 సరస్వతి నదీతీరంలో మహర్షులు అంతా లోకకల్యాణం కొరకు ఒక యాగం నిర్వహించారు.ఆసందర్బంగా త్రిమూర్తులలో ఎవరు గొప్ప అనే అంశం ఈవిషయం పై చర్చజరింది.త్రిమూర్తులలో,గుణసంపన్నుడు,శాంతమూర్తి అయినవారెవరో నిర్ణయింప తగినవారు భృగుమమహర్షి మాత్రమే అని అందరూ నిర్ణయంతీసుకుని ఆబాధ్యత భృగుమహర్షికి అప్పగించారు.

మొదట బ్రహ్మలోకం వెళ్లిన బ్రహ్మదేవుని ఎదుట నమస్కరించకుండా నిలబడ్డాడు భృగువు. సరస్వతిదేవి వీణా గానాన్ని ఆస్వాదిస్తున్న బ్రహ్మ దేవునికి భృగువురావడం అంతరాయం కలిగింది. కోపంగాచూసాడుభృగువువంక"మహర్షులను గౌరవించడం తెలియని నీకు భూలోకంలో పూజలు తక్కువజరుగుతాయి"అనిశపించి, కైలాసం వెళ్లాడు. తాండవనృత్యంలో మైమరచి ఉన్నశివపార్వతులు భృగుమహర్షి రాకను గమనించలేదు. అందుకు కోపించిన భృగుమహూర్షి"సదాశివా తపోసం పన్నులు,  మహనీయులైన మహర్షులను ఆదరించి, గౌరవించడం సంప్రదాయం. అందుకు భిన్నంగా ప్రవర్తించిన నీవు నా ఆగ్రహానికి బలికావలసిందే నీకు భూలోకంలో లింగికారంలోనే పూజలు జరుగుతాయి" అని శపించి వైకుంఠం చేరుకున్నాడు.వైకుంఠంలో మహవిష్ణువు లక్ష్మీదేవితో పాచికలు ఆడుతూ భృగుమహర్షి రాక గమనించలేదు."శ్రీహరి మహనీయులు వస్తే గౌరవించడం తెలియని అహంకారి,నన్ను అవమానపరుస్తావా"అంటూ కుడికాలితో శ్రీహరి వక్షస్ధలంపై తన్నాడు భృగువు. "మన్నించండి తపోధనా పాచికల ఆటలో లీనమైఉన్నాను.తప్పదం జరిగింది.శాంతించి ఆసీనులుకండి"అని ఆసనంపైకూర్చొబెట్టి,"స్వామి నావక్షస్ధలాన్ని తాకి తమపాదానికి ఎంత బాధకలిగిందోకదా"అంటూ ఆపాదాన్ని తనచేతుల్లోనికి తీసుకుని వత్తుతున్నట్లుగా చేస్తూ ,భృగువు అరికాలులోని 'నేత్రం'చిదిమివేసాడు శ్రీహరి.క్షణకాలంలో గర్వంవీడిన భృగువు శ్రీహరిని క్షమాపణ వేడుకున్నాడు.