విద్య(నానీలు):-డా.రామక కృష్ణమూర్తి-బోయినపల్లి,సికింద్రాబాద్.


 1.అక్షరాలు నేర్పిస్తే

అమూల్యం కదా!

మార్గం చూపిస్తే 

కర్తవ్యం కాదా!


2.అజ్ఞానం తొలగించే

బోధన!

విజ్ఞానం కల్గించడమే 

సాధన!


3.క్షరం కాని అక్షరంతో

విద్యాసేవ!

మరణం వరకు వీడని

జ్ఞానత్రోవ!


4.సంతకం ‌చేయ

నేర్పడం కాదు.

సాధించే నేర్పు

కల్గించడమే విద్య.


5.ప్రాంతమేదైనా కావచ్చు

విద్యాసేవకు.

హంగులు,ఆర్భాటాలు 

అక్కరలేదు.


6.మనిషికి ఇవ్వదగిన

దానం.

అదే అదే వెలకట్టలేని

విద్యాదానం.


7.పేదలకు చేసిన

విద్యాసేవ

పెన్నిధిగా మారి

ఇచ్చును బువ్వ.