నువ్వు: --బాలవర్ధిరాజు మల్లారం


 నా స్నేహ ప్రపంచానికి  అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవ శుభాకాంక్షలు!--------

నువ్వు....

నా 

శక్తివి 

యుక్తివి.


స్ఫూర్తివి 

కీర్తివి.


జ్యోతివి 

ఖ్యాతివి.


జవానివి 

జీవానివి.


బలానివి

బలగానివి.


ధైర్యానివి

శౌర్యానివి

.

సౌమ్యానివి

రమ్యానివి.

వడివి

వాడివి.


చిత్రానివి

చైత్రానివి.


నిధివి

విధివి.


సిరివి 

ఝరివి.


విద్యుత్తువి 

విద్వత్తువి.


ప్రశంసవి

ప్రతిష్టవి.


యాగానివి

యోగానివి.


ప్రభవి

శోభవి


మలుపువి

గెలుపువి.


మోహానివి

స్నేహానివి.


వన్నెవి

వెన్నెలవి.


నేర్పువి

ఓదార్పువి.


చేర్పువి

మార్పువి.


వికాసానివి

వినోదానివి.


భవానివి

భావానివి.


అందానివి

ఆనందానివి.


భాగానివి

భోగానివి.


గానానివి 

ధ్యానానివి.


నాదానివి

వేదానివి.


సహచరివి

సహకారివి.


సొత్తువి

సత్తువవి.


మత్తువి

గమ్మత్తువి.


గర్వానివి

సర్వానివి.


మరు మల్లివి

సిరి ముల్లెవి.


పరిమళానివి

పరవశానివి.


కళకళవి 

తళతళవి.


ఇష్టానివి

స్పష్టానివి 

.

వర్ణమాలవి

స్వర్ణబాలవి

.

దరహాసానివి

మధుమాసానివి.


కవితవి 

భవితవి .


సత్కారానివి 

సన్మానానివి.


ధ్యాసవి

శ్వాసవి.


అందుకే..

అందుకో

నీకు 

నా

అభినందనం!

అభివందనం!!