శ్రీకృష్ణఅవతారసమాప్తి.(పురాణకథ):--డా.బెల్లంకొండనాగేశ్వరరావు.

 యాదవప్రముఖులను అందరిని సమావేశపరిచిన శ్రీకృష్ణుడు."పెద్దలారా మనద్వారాకా నగరం సముద్రంలో కలిసే పెను విపత్తు త్వరలో రాబోతుంది.కనుక మీరంతా శంఖోధ్ధారక్షేత్రానికి వెళ్లండి.పురుషులు మాత్రం ప్రభాసతీర్ధానికి వెళ్లి సరస్వతినది సముద్రంలో కలిసేప్రదేశం లో పుణ్యస్నానాలుచేసి,తర్పణాలువిడిచి,విప్రులకు దక్షణలు ఇచ్చి వారిఆశీర్వాదం పొందుదాం! అనంతరం మనలను ఈవిపత్తునుండి కాపాడమని దేవతలను ప్రార్ధిధ్ధాం.నేనూమీతోనే ఉంటాను"అన్నాడు శ్రీకృష్ణుడు,
మధ్యపాన మత్తులు ఓకరిపై ఓకరు గొడవపడి పోట్లాడుతూ వారి వారి ఆయుధాలు చేతబూనారు.అలా వృష్టులు,భోజకులు, అంధకులు, సాత్వతులు వంటి వంశీయులతోపాటు శ్రీకృష్ణుని సంతతి కూడా ఉన్నారు. మునిశాపంగా పెరిగిన రెల్లు ముసలంపోడి ద్వారాపుట్టింది.అలా ఓకరిని ఓకరు ఆవేశంగా చంపుకుంటూ అందరూ మరణించారు.అంతకుమును పే ఏకలవ్యుడు,బలరామదేవుడుపోరాడుతూ, అనంత నీటి ప్రవాహంలో కలసిపోయారు.తన అవతార పరిసమాప్తి సమయంఆసన్నమైనదని గ్రహించిన శ్రీకృష్ణుడు రాగిచెట్టు వద్దకూర్చొని చెట్టుకు వీపు ఆనించి,తన ఎడమపాదాన్ని కుడి కాలుపైకి తీసుకు వచ్చి నెమ్మదిగా కదిలించసాగాడు.మునిశాపకారణంగా దోరికిన ముసలం తో వేటకు బయలుదేరిన ఓబోయవాడు,కదులుతున్న శ్రీకృష్ణుని పాదంపోదలమధ్యభాగంనుండిచూసి అది లేడి అనిభావించి ముసలంకు ములుకు తగిలించి దాన్నిప్రయోగించి దానివెంటే వేగంగా వచ్చి,పాదంలో తనబాణం తగిలిన శ్రీకృష్ణుని చూసి భోరున విలపిస్తూ,"సామి ఆహారం దొరికింది అనే తొందరపడ్డాను"అన్నాడు.దైవనిర్ణయం ఇది అని ఓదార్చాన శ్రీకృష్ణుడు ప్రాణత్యాగంచేసాడు.దేవతలు పూలవానలు కురిపించారు అనంతరం రుక్శిణి సతీసహగమనంచేయగా,సత్యభామ తదితరులు. అర్జునుని సహాయంతో తపోవనాలకు వెళ్లారు.మరణించినవారందరికి శాస్త్రోక్తంగా అంత్యక్రియలు జరిపించాడు అర్జునుడు.