మర్రిచెట్టు(బాలగేయము)-అంజయ్యగౌడ్

 మర్రివిత్తు చిన్నది

మర్రిచెట్టు పెద్దది

వేదజ్ఞానమన్నది

ఇందులోనె ఉన్నది


చుట్టూర ఊడలు

చెట్టుకు పునాదులు

విశాలమైనట్టి వేర్లు

వేదాలకు ప్రతీకలు


మర్రిచెట్టు పత్రము

మాధవునికి మంచము

ప్రలయకాల మందున

పవళించును ముద్దుగ


మనిషి జన్మ చిన్నది

మానవతము పెద్దది

మహామహుల కన్నతల్లి

భరతమాత గొప్పది