ఉల్టా -పల్టా ...!!: --------డా.కె .ఎల్వీ .హన్మకొండ .


 పిల్లలు ....

మొబైల్ చూడకూడదు 

వాడకూడదు అన్నారు ,!


మొబైల్ మరిగితే ....

చెడిపోతారు అన్నారు !


అలా తెలిసికూడా 

అందరూ మాముందే 

మొబైల్ లో ...

రకరకాల విన్యాసాలు 

చేస్తుంటారు .!


నవ్వుతుంటారు -

తుళ్లుతుంటారు ,

తదేకంగా గుచ్చి ..గుచ్చి 

చూస్తుంటారు ....!


మాలో మొబైల్ ఆసక్తిని 

మరింత పెంచుతుంటారు 

పిల్లలలకోసం 

చిన్ని ..చిన్ని ....

త్యాగాలు కూడా చెయ్యరు 

అదేలోకంగా ....

బ్రతుకుతుంటారు !


కరోనా మహమ్మారి 

కరాళ నృత్యంతో ...

కాలం మారిపొయింది 

అంతా ...

ఉల్టా -పల్టా అయింది !


గతంలో వద్దన్నవి 

ఇప్పుడు తప్పని సరి అయ్యాయి 

అంతర్జాల బడి పాఠాలకు 

మొబైలే దిక్కయింది ...

పిల్లలకు తప్పనిసరి అయింది !


కాలంతో కద లివచ్చే ...

వింతమార్పులకు ...

సలాంచేయక తప్పదేమో !

సరిపెట్టుకోక తప్పదేమో ..!!

 ----------------------------------

ఫోటోలో----ఆన్షి.నల్లి.