గున్నమామిడి గున్నమామిడిగుబురు పొదల గున్నమామిడి
గువ్వల కాపురం గున్నమామిడి
గూళ్ళల్లో సంసారం గున్నమామిడి!
గున్నమామిడి చెట్టులోన
గుంపులుగా కొమ్మలు ఆకులు
గున్నమామిడి కొమ్మల్లోన
గోరువంకల జంటపక్షులు
గున్నమామిడి ఆకుల్లోన
గుమ్మాల పచ్చ తొరణాలు
గున్నమామిడి చెట్టులోన
గుత్తులుగా పూలు పండ్లు
గున్నమామిడి పూతల్లోనా
గాన కోకిల మేతలు
గున్నమామిడి పండ్లలోనా
గుభాళించే మధుర ఫలాలు ,రసాలు
గున్నమామిడి చెట్టులోన
గుత్తులుగా పిందెలు కాయలు
గున్నమామిడి పచ్ఛికాయల్లోనా
గుప్పుమనే రుచితో అవకాయలు
గున్నమామిడి పిల్ల పిందెల్లోనా
గుర్తింపు తెచ్చే చీరల బూటలు
గున్నమామిడి: -డా.కందేపి రాణి ప్రసాద్