మాతృభాష - అక్షర శబ్దాలు:--- ఎం. వి. ఉమాదేవి నెల్లూరు


 పదునాలుగు సూత్రపు పటిష్ట మక్షర కూర్పు 

సమస్త వ్యాకరణ శాస్త్రముల కాయువగు 


పాణిని తపసు మెచ్చి పరమశివ తాండవము 

ఆయన ఢమరుకమున అక్షర శబ్దము రాగ


ఓంకార ప్రణవమును ఒప్పుగా తేజమును 

అష్టాధ్యాయి రచన అనుగ్రహ మొందెను 


తిమిరాన మునగకనె తిన్నగా విశ్వమును 

శబ్దమే కాపాడు శమముతో జ్యోతిగా 


అక్షరము లేనిదే అవని నిశ్శబ్దమగు 

దండి మహాకవియును దర్శనమె చేసేను 


నిత్యజీవితమునకు నిరంతర శబ్దములు 

మాటగా రూపొంది మానవుల మనుగడకు 


ఉచ్చరించిన పదము ఉద్దేశము ను తెలుపు 

భావ స్పందనలకు భాషయే దిక్సూచి 


నామవాచక మహిమ నామార్ధమును తెలుపు 

తపసుడను సూర్యుడు తపింపగ లోకమును 


చల్లనగు కిరణాలు చందురుని రీతియగు 

గుణము బట్టి నామము గుర్తించు శబ్దమును 


శక్తి యపరిమితముగ శబ్ద వేదమంత్ర

స్వరముల పఠనమున సాధకులు తెలిపెదరు 


ఓం నమశ్శివాయ ను ఒజ్జలు వ్రాయింతురు 

కాళిదాసు తెలిపెను కావ్య రఘువంశమున 


వాగార్ధ కలయికయె వాక్కు శివ పార్వతులు 

మహేశ్వర సూత్రములు మహి జ్ఞానభిక్షయును !!