ఎలా-- ఇలా:- సత్యవాణి
 వెలుగు చేత పట్టకనే
వెళ్ళగలవ చీకటిలో  ?
ధైర్యమింత లేకుండా
సైనికుడుగ ఎట్లగుదువు    ?
విద్య గరప నేర్పులేకె
విద్యార్థికి బోధనలా     !
రాజ్యాంగం తెలియకనే
రాజ్యమెట్లు ఏలెదవు      ?
వేద విధులు తెలికనే
విప్రుడుగా నెట్లుందువు  ?
బ్రతుకు తెరువు లేకుండగ
బ్రతికే మార్గం ఏది           ?
దేశభక్తి లేకుండా
జీవించుట వృథాకదా      !