విలువైన కలాన్ని
కట్టిపడేద్దాం ..అనుకుంటే ,
తర్వత తీరిగ్గా
వినియోగించుకుందాం
అనుకుంటే --
అదిమూర్ఖత్వమే ....!
కాలంతోపాటు
కలిసినడిచినప్పుడే ,
కాలాన్ని సజావుగా
సద్వినియోగం -
చేసుకుంటేనే ,
అనుకున్నవి -
సాధించగలుగుతాం ,
లక్ష్యాలను -
చేరుకోగలుగుతాం !
చేజారిన కాలం
తిరిగిరానిది ....!
కరిగిపోయిన కాలం ,
మరువరానిది ...!!
విలువ ...----డా.కె .ఎల్.వి.ప్రసాద్ , హన్మకొండ .