కమలాకాయ : -డా.కందేపి రాణి ప్రసాద్


 కమలాకాయ !కమలాకాయ!


గుండ్రని కాయ

కమ్మని కాయ


పసందైన కాయ

ఇష్టమైన కాయ


బోలు బోలు తోలు

తోలు తిస్తే తొనలు


తొనాలు వలిస్తే ముత్యాలు

ముత్యాల నిండా రసాలు


కమలాలు ఆరోగ్యానికి నిలయాలు

కమలాలు సింధూరపు నిగనిగలు


కమలాలు తీపి రసాల పానీయాలు

కమలాలు నాగపూర్ పొలాన పంటలు