భాగ్యనగరం చూడరా బాబూ ...!!:----డా.కె .ఎల్వీ .హన్మకొండ .


 హైదరాబాదు 

చూసానూ ...

అది ...

మహానగరమని 

విన్నాను ...!


భాగ్యనగరం అంటే 

హైదరాబాదని ...

తాత చెబితే -

తెలిసింది.!


ఇక్కడ చూడదగ్గవి 

చాల వున్నాయట 

అమ్మ మ్మ చెబితే 

తెలిసింది .!


హైదరాబాదును 

సికింద్రాబాదును 

టాంక్ బండ్ 

కలుపుతుందట 

మమ్మీ చెబితే 

తెలిసింది ....!


రవీంద్ర భారతీ -

అసెంబ్లి హాలు ,

చార్మినార్ -

గోల్కొండ కొట

సాలార్జంగ్ మ్యూజియం

నెహ్రుజంతుప్రదర్శన పార్కు 

అన్నీ చూడాలని ...

డాడీ చెబితే తెలిసింది !


మళ్ళీ తప్పక వస్తాను 

భాగ్యనగరం చూస్తానూ 

అన్ని ప్రదేశాలూ 

తిరిగేస్తా ---!

కథలు -కథలుగా 

చెప్పేస్తా ....!!

------------------------------

ఫొటోలో---బేబీ ఆన్షి. నల్లి.