అది మంచి ఇల్లు కట్టుకుంది.చక్కటి పిల్లను పెళ్లి చేసుకుంది.కాపురం పెట్టింది.ఆ పంది దంపతులకు పది పిల్లలు పుట్టారు.ఆ పిల్లలు బలే ముద్దుగా ఉండేవి.తల్లి దండ్రులు ఆ పిల్లలను చూసుకుని మురిసిపోయేవారు.లోకాన్నే మరిచిపోతున్నారు.మగపంది అడపందితో ఇలా చెప్పింది."ఏమేయ్! మన పిల్లలకు బారసాల చేద్దాం. అడవిలోని జంతువులన్నింటిని పిలుద్దాం. ఇల్లు శుభ్రం చేయి. ఇంటి ముందు రాళ్ళ గుట్టలు తొలిగించు. ఇంటి వెనకున్న మురుగుగుంటపై ముళ్లకంప వేయి. నేను అతిథులను పీలుస్తాను. విందు ఏర్పాట్లు చూస్తాను" అంది."అలాగే! అలాగే!!" అంది ఆడపంది.అందిగానీ పిల్లలను వదిలి బయటకు వస్తేనా?రాళ్ళగుట్ట అలాగే వుంది.మురుగు గుంట అట్లాగే ఉంది.మగ పంది అందరిని పిలిచింది.విందు ఏర్పాట్లు ఘనంగా చేసింది.పెద్ద పందిరి వేసి పది ఉయ్యాలలు కట్టింది.ఆడపంది పది పిల్లలను ఉయ్యాలలో వేసింది.విందుకు వేళయింది.ఒక్కొక్క అతిధి రాసాగాయి.నక్క, కుందేలు, గాడిద ముందుగా వచ్చాయి.విందు ఏర్పాట్లలో సాయం చేస్తున్నాయి.ఇంతలో మృగరాజు సింహం ఇంటి వెనకనుంచి వస్తూ ఉంది.మురుగు గుంట వాసన భరించలేకపోయింది.కాలు జారి మురుగులో పడింది.లాక్కుని పీక్కోని ఎలాగో బయట పడింది.కోపంతో రగిలిపోయింది.అదే సమయంలో గజరాజు ఏనుగు ముందు నుంచి వచ్చింది.రాళ్ళగుట్ట తగిలి కింద పడింది.దంతాలకు దెబ్బతగిలింది.తొండం డొక్కుపోయింది.ఇది కూడా కోపంతో బుసకొట్టింది.రెండూ కలిసి పంది దంపతులపై దాడి చేశాయి.సింహం పంజా దెబ్బకు వాటికి గాయాలయ్యాయి.ఏనుగు వీరాంగానికి కొత్తగా కట్టుకున్న ఇల్లు కూలిపోయింది.వచ్చిన అతిధులు పంది పిల్లలను కాపాడి తలా ఓ దిక్కు పారిపోయాయి.నీతి: విందుకైనా, పొందుకైనా సమవుజ్జి ఉండాలి.
పంది దంపతుల విందు.(బుజ్జిపిల్లలకు బుజ్జికథ):- ౼ దార్ల బుజ్జిబాబు