పెరుగు: -డా.కందేపి రాణి ప్రసాద్


 పెరుగమ్మా పెరుగు

పులు పెక్కని పెరుగు

తియ్యనైన పెరుగు

కమ్మనైన పెరుగు


చద్దన్నానికి పెరుగు

దద్దోజనానికి పెరుగు


మినప ఆవిడకు పెరుగు

మెంతి మజ్జిగ కు పెరుగు


చిట్టి పాపాలకు పెరుగు

చిన్ని కృష్ణునికి పెరుగు

చల్లదనాన్నిచ్చే పెరుగు

చర్మ నునుపుకు పెరుగు


చక్కని పాలు పితికి

చక్కగా మరగబెట్టి 

చుక్క మజ్జిగ తొడుతో

చక్కనైన గడ్డ పెరుగు


పెరుగు రోజూ తినండి పాపాలూ

పెరుగుతారు పొడుగ్గా బాలలూ!