గాడిద -బాలగేయం :--ఎం. వి. ఉమాదేవి నెల్లూరు.


 గాడిద ఎంతో శ్రమజీవి 

అందరికీ ఇది  అల్పజీవి !

రజకుల బట్టలు మోస్తుంది 

రైతుకు సాయం చేస్తుంది!


స్వరమే కరుకై అరుపున్నా 

ఓండ్రకి సాటి ఎవరన్నా? 

కుక్క పనినే  తను చేసి 

దెబ్బలు తినెనే పాపమన్నా !


సోమరిపోతును గాడిదనీ 

అనకోయ్ !చెంపలువేసుకొనీ! 

ఉప్పూ,రోళ్లు మోస్తూనే 

ఊరు వాడా తిరిగేనే !


గాడిద పాలతో స్నానంతో 

క్లియోపాత్రా అందమెంతో 

ఇతిహాసంలో గార్దభమూ 

శిశువుకు పాలూ ఔషధమూ!