ఏడువాకు ఏడువాకుయెర్రీ నాగన్నా
ఏడిస్తె నీకళ్ళు
నీలాలు గారూ
అదుగో బూచాడూ
అటకమీద ఉన్నాడూ
ఏడిస్తె నిను వాడూ
ఎత్తుకు పోతాడూ
నోరు తెరుచుతాడూ
కోరలూ చూపుతాడూ
నీ ఏడుపూ విన్నాడూ
ఈసారీ యిక వూరుకోడూ
అల్లరీ చేయకుండా
చక్కంగ నిదురపోతే
నిన్ను వాడేమి చేయాడూ
ఏడువాకు ఏడువాకు
యెర్రీ నాగన్నా !!
బూచాడు: -:- డా.గౌరవరాజు సతీష్ కుమార్.