సంస్కారం(బాలగేయం); - అన్నాడి జ్యోతి--సిద్దిపేట‌.

 చదువుకన్న మిన్న సంస్కారమే యన్న
పెద్దవారి మాట‌ చద్దిమూట‌
మాట‌ మంచితనము మన్నన గలిగించు
జగతిలోన నీకు జయము గలుగు
తల్లిదండ్రి మాట‌ తప్పక పాటించు
సర్వ శుభములొసగు సతతముగను
సత్యవాక్కు పలికి చక్కంగ జీవించు
జగతిలోన నీకు జయము గలుగు
ఆడపిల్లలన్న అమ్మలా భావించు
గౌరవించుమెపుడు  ఘనముగాను
మనమునందు నెపుడు మంచి యోచన తోని
మానవత్వమెరిగి మసలు కొనుము
అన్నదమ్ములన్న ఆప్యాయతగ నుండు
కలతలేమి లేక కలిసి యుండు
భరతమాత మురియు భవితయు బాగుండు
జగతిలోన  నీకు జయము గలుగు