ఎర్ర బస్సు(బాల గేయం )ఎడ్ల లక్ష్మి-సిద్దిపేట


 ఎర్రబస్సు వచ్చింది

ఎదురుగుండ ఆగింది

పరుగు పరుగున రారండి

లష్కర్ బస్సు ఎక్కండి


ఆకుపచ్చని బస్సండి

పల్లె వెలుగు బస్సండి

బస్సు కండక్టరొచ్చాడు

టికెట్ మీరు పొందండి


టికెట్ లేని ప్రయాణం

మీరు చేయుట నేరం

దండగ మీకు వెస్తారు 

శిక్ష మీకు పడుతుంది


బస్సు కదిలి పోతుంది

ఊరు పొలిమెర దాటింది

పల్లె పట్నం దాటుతూ

మీ ఊరిలోన ఆగింది