గాలిపటం: --డా.కందేపి రాణి ప్రసాద్


 ఒక పాతదైన పేపరు

రెండు చీపురు పుల్లలు

కాసిని అన్నం మెతుకులు

కొంచెం తోక అతికిస్తే

అంద చందాల గాలిపటం!


చేతికి చూపుకు బంధం కలుపుతూ

వీచే గాలికి ఉయ్యాలాలు ఊగుతూ


చెట్టు చేమలు దాటి పరిగెడుతూ

గగనాన్ని చేరాలని ఆరాటపడే

ఆకాశదీపం గాలిపటం


తోకను వయ్యారంగా ఊపుకుంటూ 

గాలిని సర్రుసర్రున తోసుకుంటూ

దారాన్ని గట్టిగా లాగేసుకుంటూ

నింగిలోకి చకచకా దూసుకెళ్లే

తోక చుక్క గాలిపటం!


గాలిలో పైకీ కిందకీ గిరికీలు కొడుతూ

తారల మధ్య తారకలా రెపరెపలాడుతూ

విభిన్న ఆకారల్లో తెలియాడుతూ

పిల్లల కళ్ళలో సంతోషాలు పూయించే మెరుపుల గాలపటం