తెల్ల ఆవాలలో పలురకాల ఔషధ గుణాలు ఉన్నాయి. ఇవి జీర్ణ శక్తిని పెంచుతాయి. స్త్రీలలో గర్భాశయ వ్యాధులు రాకుండా కాపాడుతుంది. కీళ్లవాతం వాపులు రానివ్వదు. తెల్ల ఆవాలను పొడిగా చేసి కొద్దిగా మిరియాల పొడి, ఇంగువ పొడి, ఉప్పు కలిపి నీళ్లలో వేసి మరిగించి కషాయం గా చేయాలి. చల్లారిన తర్వాత పరగడుపున త్రాగాలి. ఇది ఉదర సమస్యలను పోగొట్టి జీర్ణశక్తిని పెంచుతుంది. చక్కెర వ్యాధి రాకుండా కాపాడే ఇన్సులిన్ ఉత్పత్తికి తోడ్పడుతుంది. స్త్రీలలో రుతుక్రమాన్ని సరిచేసి గర్భాశయ వ్యాధులు రాకుండా కాపాడుతుంది.
ఆముదంలో తెల్ల ఆవాల పొడి కలిపి కొద్దిగా నీరు పోసి అందులో బియ్యప్పిండి కూడా వేసి సంకటి లాగా కాచాలి. చల్లారిన తర్వాత ఆ మిశ్రమాన్ని ఒక గుడ్డు పైపూతగా పూసి కీళ్లవాతం వాపుల పై కట్టుగా కట్టాలి. చాలా త్వరగా వాపులు, కీళ్ల నొప్పులు తగ్గిపోతాయి.
ఎక్కిళ్ళు వచ్చినప్పుడు ఒక గ్లాస్ నీటిలో తెల్ల ఆవాల పొడి కలిపి పై నీటిని తాగుతుంటే ఎక్కిళ్లు తగ్గిపోతాయి.
తెల్ల ఆవాలు పొడిలో తేనె కలిపి నాకితే దగ్గు ఆయాసం తగ్గిపోతుంది.
తెల్ల ఆవాలను నిప్పులపై వేసి పొగ వేసి నప్పుడు మనకు కనిపించని వ్యాధికారక క్రిములు పా రి పోతాయి. అందుకోసం హోమ ద్రవ్యాలలో తెల్ల ఆవాలను కూడా కలుపుతారు.
తెల్ల ఆవాలు- ఔషధ గుణాలు...:- పి .కమలాకర్ రావు