చూడాలని ఉంది ..!!:-----డా.కె .ఎల్వీ .హన్మకొండ .


 చూడాలని ఉంది ,

చెట్లు -చేమలతో ,

అల్లుకున్న తీగమొక్కలతో 

మొక్కడొంకలతో ....

చిక్కని ..చక్కని 

వృక్షసంపద ఉండే 

అడవిని చూడాలని ఉంది !అడవుల్లో సంచరించే 

వన్యమృగాలను 

వాటి జీవన విధానాలను 

చూడాలని ఉంది 

వాటిగురించి తెలుసుకోవాలని 

తెగ కోరికగా ఉంది ....!


మానవమృగాలకూ 

వన్యమృగాలకు 

అసలు తేడా ఏమిటో 

తెలుసుకోవాలని ఉంది !

అందుకే ---

అడవిని చూడాలనిఉంది !


ఔషద గుణాలుగల ...

అమూల్యమయిన -

మొక్కలను ,

అన్వేషించాలనివుంది !


వాటి విలువను 

తెలుసుకోవాలని ఉంది 

అడవిగొప్పదనమేమిటో 

అందరికి చెప్పాలని ఉంది !


అడవులను 

సంరక్షించుకునే 

విధానాలను 

నలుగురికీ --

బోధించాలని ఉంది ....!

అందుకే ----

అడవిని చూడాలని ఉంది !!


           ----------------------

ఫొటోలో----బేబీ ఆన్షి.నల్లి.