సైన్స్ కథ : -ఎం బిందుమాధవి
     "భూమాత శక్తి వరం" 
"పిల్లలూ ఇవ్వాళ్ళ దేని గురించి మాట్లాడుకుందామో మీరే చెప్పండి" అన్నారు పద్మజ టీచర్. "మనకితెలియనంతవరకూ, మన చుట్టు ఉన్న విషయాలు మనకి భయం కలిగిస్తాయి. తెలుసుకోవటం మొదలుపెట్టాకకుతూహలం కలిగిస్తాయి. తెలుసుకున్నాక అద్భుతంగా, ఆశ్చర్యంగా అనిపిస్తాయి అవునా" అన్నారు. 
"అవును టీచర్. బంగాళాఖాతం లో తరుచు తుఫానులు ఏర్పడటం వల్ల తీర ప్రాంతాల్లో ఊళ్ళు మునిగిపోవటం, రోడ్లుగండ్లు పడటం, పంటలు నేలకొరిగిపోవటం, పశువులు చనిపోవటం వింటున్నాం కద టీచర్. అలాగే భూకంపాలువచ్చినప్పుడు కూడా భారీ జననష్టం, ఆస్తి నష్టం జరగటం చూస్తున్నాం. ఇలా ప్రకృతి బీభత్సాలని ముందుగాతెలుసుకోగలిగితే నష్టాన్ని కొంత తగ్గించచ్చు కదా టీచర్. పాపం తల్లిదండ్రులని పోగొట్టుకుని అనాధలైన పిల్లలు, పంటలని..పశువులని పోగొట్టుకుని నిరాధారమై పోయిన రైతులని చూస్తుంటే, నష్ట పరిహారం చెల్లిస్తామని ప్రకటించేప్రభుత్వం, వారిని ముందుగా హెచ్చరించవచ్చు కదా అనిపిస్తుంది." 
"అసలు ఈ భూకంపాలు, త్సునామీలు, తుఫానులు ఎలా ఏర్పడతాయి? అవి ఎలా ఏర్పడతాయో తెలిస్తే, ముందుజాగ్రత్తలు తీసుకోవటం సులువేమో కదా టీచర్" అన్నాడు ప్రకాష్. 
"మంచి సూచన ప్రకాష్! సరే ఇవ్వాళ్ళ భూకంపాల గురించి, త్సునామిల గురించి తెలుసుకుందాం" అన్నారు. 
"అనేక చిన్న చిన్న రాళ్ళు ఒక సమూహంగా ఏర్పడి పెద్దరాయిగా మారటం ద్వారా భూమి పై పొర ఏర్పడుతుంది. ఇలాచిన్న చిన్న రాళ్ళు  ఒక పెద్ద రాయిగా(block) రూపాంతరం చెందేటప్పుడు వాటి మధ్యలో సహజమైన పగుళ్ళు, అతుకులుఉండిపోతాయి. అలా చిన్న రాళ్ళ సమూహంతో పక్క పక్కనే ఏర్పడిన పెద్ద రాళ్ళు కొన్ని... అతుకులు ఉన్న చోట ఒకదానితోఒకటి వేగంగా ఒరుసుకుంటూ పక్కకి జరుగుతూ ఉంటాయి. ఈ కదలికలకి అనేక కారణాలు ఉంటాయి. అలాఒరుసుకునేటప్పుడు వాటి మధ్య ఒక బలమైన శక్తి పుడుతుంది. ఆ శక్తిని "విద్యుదయస్కాంత శక్తి" అంటారు. ఆ శక్తిభూమికి బాగా లోతుగా కానీ, డొల్లగా ఉన్న  ప్రదేశం లో కానీ బయట పడచ్చు. కేంద్రీకృతమైన శక్తి అలా బయటపడేప్రదేశాన్ని "ఫోకస్" అంటారు. "ఫోకస్" ఏర్పడిన భూపైపొర భాగాన్ని "ఎపి సెంటర్" అంటారు."
6E150820-C19F-40F8-BD51-F8A92EC29E28.png
"భూకంపాలు ఏర్పడటాన్ని ఇంకా వివరంగా తెలుసుకుందాము. ఉదాహరణకి ఒక కర్రని చేత్తో మధ్యలో కి విరిచే ప్రయత్నంచేశామనుకోండి. విరగటానికిముందు, వంగే ప్రక్రియలో ఆ కర్ర పై పొరలో, అంటే బెరడులో అన్నమాట, సన్న సన్న పగుళ్ళుఏర్పడతాయి. ఆ తరువాత పూర్తిగా విరుగుతుంది."
"అలాగే భూమి పెద్దగా కంపించే ముందు, చిన్న చిన్న ప్రకంపనలు ఏర్పడతాయి. ఈ చిన్న ప్రకంపనలని "foreshocks" అంటారు. రాతి పలకలు ఒరుసుకుంటున్నప్పుడు శక్తి విడుదల అవుతుందని పైన చెప్పుకున్నాం కదా! అలా శక్తి విడుదలఅవుతున్నదని ఈ foreshocks ద్వారానే  తెలుస్తుంది. క్రమేణ ఒరుసుకోవటం లో వేగం పెరిగి ఒక్కసారిగా అధిక శక్తివిడుదలవుతుంది. ఆ శక్తిని "విద్యుదయస్కాంతం" అంటామని కూడా పైన తెలుసుకున్నాం! ఇది తరంగాలుగాభూమిలో ఒక చోటి నించి మరొక చోటికి ప్రయాణిస్తుంది. ఉదాహరణకి భారత దేశంలోని భూమి పొరల్లో విడుదల అయిన"విద్యుదయస్కాంతం" తరంగాల ద్వారా అమెరికాకి ప్రయాణిస్తుందన్నమాట!"
"క్లుప్తంగా చెప్పాలంటే, రాతి పలకల ఒరిపిడి ద్వారా జనించిన శక్తి, తరంగాల ద్వారా వ్యాపించి భూప్రకంపనలుకలిగిస్తుందన్నమాట. అదే మనకి తెలిసిన భూకంపం!"
485CABBD-D337-4D2C-8A23-48CA67407343.png
 "ఈ భూ ప్రకంపనలని కొలిచే కొలబద్దని "రిక్టర్ స్కేల్" అంటారు. సాధారణంగా ఈ ప్రకంపనల తీవ్రత 1-10 దాకాఉంటుంది. 1 అయితే అతి తక్కువ అని, 10 అయితే తీవ్రమైన భూకంపమని అంటారు."
"ఈ విద్యుదయస్కాంత తరంగాలని "సిస్మోగ్రాం" అనే యంత్రం ద్వారా నమోదు (record) చేస్తారు."
B514F3A1-3E97-4D65-B13C-0A1B0CA91521.png
"రిక్టర్ స్కేల్ మీద 4-4.5 తీవ్రతతో భూమి కంపించినప్పుడు ఒక వ్యక్తి కుర్చీలో కూర్చుని ఉన్నా కూడా భూ ప్రకంపననితెలుసుకోగలడు. అదే 6 పైన వస్తే, అపార నష్టం కలిగే అవకాశముంటుంది. భూ ప్రకంపనలు తమంతట తాము నష్టాన్నికలిగించవు. ఆ ప్రకంపనల తీవ్రతకి భవనాలు, ఇతర నిర్మాణాలు కూలిపోయి వాటి కింద ప్రాణులు (మనుషులు కానీజంతువులు కానీ) చిక్కుకోవటం వల్లే చనిపోవటం జరుగుతుంది."
"మనం నివసించే ఈ భూమి మీద ప్రకంపనలు రాని చోటంటూ ఏదీ ఉండదు. భూ పొరల్లో రాతి పలకల ఒరిపిడినిరంతరం జరుగుతూనే ఉంటుంది. తత్ఫలితంగా విద్యుదయస్కాంత శక్తి ఎప్పుడూ విడుదల అవుతూనే ఉంటుంది."
"జపాన్ దేశంలో భూకంపాలు చాలా ఎక్కువగా వస్తాయని మనకి తెలుసు! అయినా భవన నిర్మాణాలు భూకంపాలకితట్టుకుని నిలబడే విధానంలో కట్టటం వల్ల అక్కడ కూలిపోవటం వల్ల జరిగే నష్టం తక్కువే అని చెప్పచ్చు."
"అలాగే ఫిలిప్పిన్, ఇండొనేషియా, ఉత్తర, దక్షిణ అమెరికాల పడమటి తీరంలో కూడా భూకంప ప్రభావం ఎక్కువే! సాధారణంగా భూకంపాలు ఒక సమయంలో ఒక ఖండంలోనే ఏర్పడతాయి. సముద్ర మధ్యంలో ఏర్పడే కంపాన్ని"త్సునామి" అంటారు. భూమిపైన ఉన్నట్లే సముద్రం లోపల కూడా పర్వతాలు, లోయలు, పెద్ద పెద్ద రాతి పలకలుఉంటాయి. చిన్న చిన్న రాళ్ళు ఒక చోట చేరి పెద్ద రాతి పలకలుగా ఏర్పడతాయని పైన చెప్పుకున్నాం కదా! అలా ఒక చోటికిచేరిన చిన్న రాళ్ళ మధ్య పగుళ్ళు, ఖాళీలు, అతుకులు ఉంటాయి. అలా ఏర్పడిన అతుకుల వైపు రాతి పలకలు ఒకదానితోఒకటి ఒరుసుకున్నప్పుడు, భూమి లోపల ఏర్పడినట్లే సముద్రం లో కూడా శక్తి ఉద్భవిస్తుంది. ఆ శక్తి వల్ల అలలు పది-ఇరవైఅడుగులు ఎత్తుకి ఎగుస్తాయి.  అలాగే ఆ శక్తి అలల ద్వారా చాలా దూరం ప్రయాణిస్తుంది. సముద్రపు ఒడ్డుకి ఆ శక్తితోప్రయాణించే అలలు తీవ్రంగా ఉంటాయి."
"అలా రిక్టర్ స్కేల్ మీద 7 కంటే ఎక్కువ తీవ్రతతో  సముద్రంలో వచ్చే ప్రకంపనలు ఎత్తుకి  ఎగసే అలల ద్వారా ఒడ్డుకి చేరితీవ్ర నష్టాన్ని కలిగిస్తాయి. 2004 సంవత్సరంలో సుమత్రా దీవికి పడమటి దిక్కుగా రెక్టర్ స్కేల్ మీద 9 తీవ్రతతో వచ్చిన భూప్రకంపనలు, భారతదేశాన్ని "త్సునామి" గా తాకి కలిగించిన అల్ల కల్లోలం మీరు చదివే ఉంటారు."
"అందుకే సముద్రం లో తుఫాను, త్సునామి రాబోతున్నదని ప్రకటించినప్పుడు జాలరులని సముద్రం మీదకి వెళ్ళద్దనిహెచ్చరిస్తారు. అలా చేసిన హెచ్చరికలు లెక్క చెయ్యకుండా కానీ, హెచ్చరిక వచ్చే లోపు వెళ్ళినా పాపం వారు సముద్రం లోకొట్టుకుపోవటం జరుగుతూ ఉంటుంది."
"ప్రకృతి మాత మనకి ఎన్ని వరాలిస్తుందో, మన నిర్లక్ష్యానికి పాఠాలు కూడా ఇలా  చెబుతుంది. మనం బతుకుతూ ఇతరజీవులని...అవి చెట్టా, నదా, కొండలా, ఇతర జీవ రాశులా, ఎవరైనా బ్రతకనివ్వాలి.  జీవ వైవిధ్యం ప్రకృతి సమతుల్యతనికాపాడుతుంది." "చూశారు కదా...ప్రకృతిలో అంటే భూమిలో, నీటిలో ఎప్పుడూ కదలికలు జరుగుతూ అనుక్షణం శక్తి పుడుతూనేఉంటుంది. ఇప్పుడు ఆ సహజ శక్తిని ఉపయోగించి మానవ కళ్యాణానికి కావలసిన అనేక అభివృద్ధికార్యక్రమాలుచేపడుతున్నారు. పర్యావరణవేత్తలు కూడా దాన్నే ప్రోత్సహిస్తున్నారు."
"బెల్ కొట్టారు, వచ్చేవారం మరికొన్ని తెలుసుకుందాం!" అని టీచర్ బయటికి వెళ్ళారు. 
material provided by 
Prof. D Chandrasekharam
Retd. Prof. IIT Bombay, visiting professor, IIT. Hyderabad.
9819807661