జీవన సౌరభాలు వీరు ....:----మొహమ్మద్. అఫ్సర వలీషా-ద్వారపూడి (తూ గో జి)


 వీరు  ప్రేమదారంతో చుట్టబడిన

వికసించిన కుసుమాల మాలలు....


ఒకొరినొకరు అర్ధం చేసుకుని

చెట్టాపట్టా లేసుకుని సరాగాలు 

తీసే సంతోష చిలకా గోరింకలు.....


అపార్థాల తెరలు లేని కడలి కెరటాలు

అవరోధాల దుప్పట్లు తొలగించుకునే అర్థాలు.....


అవని లోని ఆనందాల

తీగకు లతలా చుట్టుకునే

పాదులు.....


ఆశయాల పందిరి లో 

ఆశల పన్నీరు జల్లుకునే

జీవనదులు.....


నిశీధి తిమిరంలో

ఒడిదుడుకులను 

తట్టుకునే నింగీ నేలలు....


జీవితపు చరమాంకం

వరకు ఒకరికోసమొకరు

తోడుండే అనోన్యపు 

తోడు నీడలు...