బాలగేయం:---సత్యవాణి


 పిల్లమ్మ పిల్లి

మాయదారి పిల్లి

పిల్లమ్మ చూపెపుడు

పాలగిన్నెలపైనే


కుక్కమ్మ కుక్క

మాయదారి కుక్క

కుక్కమ్మ చూపంత

కూటికుండపైనే


ఎలుకమ్మ ఎలుక

మారదారి ఎలుక

ఎలుకమ్మ చూపంత

మాఇంటి గాదిపైనే


కొడమ్మ కోడి

మాయదారి కోడి

కోడమ్మ చూపంత 

కొర్ర గింజలపైనే


కోతమ్మ కోతి

మాయదారి కోతి

కోతమ్మ చూపంతా

కొబ్బరి బొండాలపైనే


అమ్మంటే అమ్మే

మామంచి అమ్మ

మా అమ్మ దృష్టంత

మా పైనే మా పైనే

మా పెరుగుదలపైనే