విధి విసిరిన వీధి బాలుడు:- కవిత వేంకటేశ్వర్లు

 ఏ తల్లి బిడ్డడో
ఆ తండ్రి ఎంత కసాయి వాడో
ఏ తప్పు జరిగిందో
ఏ నిప్పు అంటుకుందో
ఏ ముప్పు ముసిరిందో
ఏ బంధం తెగిందో
ఏ అనుబంధం అగ్గి బుగ్గయిందో
ఏ నష్టం జరిగిందో
ఏ కష్టం వచ్చిందో
ఏ ప్రాణం పోయిందో
ఎవరి దిష్టి తగిలిందో
వారిద్దరూ ఏమయ్యారో
మాయమయ్యారో
మరణించినారో
పిల్లోడు మాత్రం రోడ్డు పాలయ్యాడు
నడిరోడ్డు పాలయ్యాడు
అక్కరకు రారెవరు-ఆదుకోరేవరు
అడుక్కోవడమే తెలుసు
కాడేవరికి కంట్లో నలుసు
లేదు వాడికి బంధాల గొలుసు
ఉంది వాడికి అందాల మనసు!!