అమ్మ...(బాలగేయము)-అంజయ్యగౌడ్
 అదిగో అదిగో అమ్మ
అల్లదిగో అదిగో అమ్మ
ఇదిగో ఇదిగో అమ్మ
ఈ జన్మమొసంగెను బ్రహ్మ
అమ్మనుమించిన దైవము లేదు
ఆత్మనుమించినసాక్యము లేదు
అనురాగానికి మరోరూపమే
అమ్మే అమ్మే అమ్మే అమ్మేరా
నవమాసాలు మోస్తుంది 
నానా బాధలు పడుతుంది
పురిటి నొప్పులనె పులకరింపు లో
శిశువుకు జననం యిస్తుంది
సంతోషం కురిపిస్తుంది
అమ్మప్రేమను పొందుట కొరకే
ఆ భగవంతుడు పలుమార్లు
అవనిపైన జనియించాడు
అమృతమైనా అమ్మప్రేమకు
సాటిరాదని చెప్పాడు
మొదటి గురువు అమ్మౌతుంది
బుద్ధి జ్ఞానం చెపుతుంది
పాలబువ్వను తినిపిస్తుంది
ఊయలలేసి ఉగ్గును పోసి
జోలపాటతో జోకొడుతుంది
అమ్మకుసాటి వేరేముంది...