కొల్లూరు గేటు కాడ కోతులున్నయీపొల్లూరు గేటు కాడ పోతులున్నయీ
ఎల్లంపల్లి గేటు కాడ
నల్లు లున్నయీ
అల్లంపల్లి గేటు కాడ అల్లమున్నదీ
బెల్లంపల్లి గేటు కాడ
బెల్లమున్నదీ
ఇటిక్యాల గేటు కాడ ఇటుకలున్నయీ
జగిత్యాల గేటు కాడ జలగలున్నయీ
డొంకరాయి ఊరి చుట్టు డొంకలున్నాయి
ఎంకిరాల డొంకలోన పెంకలున్నయీ
మల్యాల గేటు కాడ మల్లెలున్నయీ
వెల్చాల గేటు కాడ వెచ్చమున్నదీ
మంచిర్యాల గేటు కాడ సంచులున్నయీ
ముడిమ్యాల గేటు కాడ మురుకులున్నయీ
ఈదులూరి ఊరి చుట్టు ఈదు లుండెనూ..
తాళ్లూరి ఊరి చుట్టు
తాళ్లు ఉండెనూ..
తమ్మిలేరు ఊరి చుట్టు తుమ్మలున్డెనూ..
ఇప్పర్తీ ఊరి చుట్టు ఇప్పలుండెనూ..
తిప్పర్తీ ఊరి చుట్టు తిప్పలుండెనూ..
కౌకూరు ఊరి చుట్టు కణుజులుండెనూ..
బుల్కపురం ఊరి చుట్టు బుర్కలుండెనూ..
గోలుకొండ గేటు కాడ
గొల్లె మున్నదీ..
తూలుగొండ చెఱువు కాడ తూము లున్నయీ
ఏ ఊరికి ఆ ఊరూ కథలు ఉన్నాయి..
ఆ కథలన్నీ తెలుసుకునే కనులు ఉన్నయీ...
మన చుట్టూ మన చుట్టూ మల్లెలున్నయి
కని పెట్టీ తిరుగకుంటే ముళ్ళు లున్నయీ..
కొల్లూరు గేటు కాడ:---గంగదేవు యాదయ్య