సామెత కథ : ఎం . బిందు మాధవి

 పడ్డ చోటే వెతుక్కోవాలి!
 
విమలకి ‘నటన’ అంటే సరదా. ఆమెభర్త కూడా బాగా ప్రోత్సహించాడు. ‘యాక్టింగ్ స్కూల్’కి కూడా వెళ్ళి నటనలోమెళుకువలు నేర్చుకుంది. ఏ ఆధారంలేకుండా, వెనకాల ఏ గాడ్ ఫాదర్స్ లేని వారి నటనా జీవితం  ‘వారసులకి జరిగినట్లుగా’ నల్లేరు మీద బండీ లాగా సాగదని తెలిసినాఆ రంగానికి ఉన్న ఆకర్షణ అలాంటిది మరి. కేవలం ఆసక్తి, పట్టుదల, కృషి ఉన్నంతమాత్రాన సరిపోదు. విజయం పరుగెత్తుకురాదు.
విమలకి తెలిసిన వాళ్ళెవరో ఉన్నారని, వాళ్ళ ద్వారా ప్రయత్నం చేసి మొత్తానికి‘సినిమా రంగం’, ‘బుల్లితెర రంగం’ లోకిఅడుగు పెట్టగలిగింది. కానీ అవకాశాలనేవిఎండ మావుల్లాంటివి. ఎప్పుడు వస్తాయోతెలియదు, వచ్చినా చివరి దాకా అవినిలబడతాయని నమ్మకం లేదు. అయినాఎందరినో అక్కున చేర్చుకున్న ‘రంగం’ తననిమాత్రం ఆదరించదా అని ఒక ఆశ.
విమల సినిమా రంగంలో ఏదోనిలదొక్కుకున్నది, తను కూడా వెళ్ళి ఏదోపీక్కు తినాలని తన ఫ్రెండ్ సంధ్య కూడావిమలతో మంతనాలు మొదలు పెట్టింది. తనకే పెద్దగా అవకాశాలు లేవని ఫ్రెండ్దగ్గర ఉన్నది ఉన్నట్లుగా విమల చెప్పలేదు, అలా అని తన ఫ్రెండ్ కూడా శలభం లాగావచ్చి పడి జీవితం పాడు చేసుకోవటంచూస్తు చూస్తూ ఆమోదించలేక పోయింది.
విమలకంటే ఇది ఒక కాలక్షేపమే. కానీ, అదే ముఖ్య వృత్తిగా చేసుకోవాలనుకున్నసంధ్యని ఎలా నివారించాలో విమలకి అర్ధంకాలేదు. సంధ్య, ఒకటి రెండు సార్లువిమలతో కలిసి షూటింగ్ కి కూడా వెళ్ళింది. విమల తను షూటింగ్ లో బిజీ గాఉన్నప్పుడు, సంధ్య నెమ్మదిగా అక్కడిటెక్నీషియన్ లతో, ఇతర జూనియర్నటులతో పరిచయం పెంచుకున్నది. విమలకి విషయం తెలిసే లోపే, సంధ్యకిఅవకాశాలు ఇప్పిస్తానని వల వేసి ఒకఅసిస్టెంట్ ఆశ చూపించి తరచు ఫోన్ చేసిపిలిపించేవాడు.
అప్పటివరకు బాగానే ఉన్నది, కానీసంధ్య ఇంట్లో వాళ్ళకి చెప్పకుండా‘జూనియర్ ఆర్టిస్ట్’ లని సప్లై చేసే ఒకకాంట్రాక్టర్ తో రెగ్యులర్ కాంటాక్ట్ పెట్టుకుని, అతనితో మంతనాలు సాగిస్తూ ఉండేది. అమాయకులు దొరకాలి కానీ, అవకాశంఎవరు వదులుకుంటారు? వేషం ఇస్తాననిముందు లోబరచుకుని, ఏదో అనామకపువేషం ఒకటి ఇచ్చి తనచుట్టూ తిప్పుకోవటంమొదలుపెట్టాడు. ఆ ‘ఊబి’లోకి దిగాక కానీ‘వాస్తవాలు’ బోధ పడలేదు, సంధ్యకి.
ఇప్పుడు అందులోనించి బయటికిరాలేదు, ఆ రంగం లో ఒక స్థానాన్నిసంపాదించుకోలేదు. క్రమంగా ఈ విషయంఇంట్లో వాళ్ళకి తెలిసి నచ్చ చెప్పటానికిప్రయత్నం చేశారు. కానీ సంధ్య అప్పటికే తనజీవితం పాడయ్యిందనీ, ఆ విషయం తనసర్కిల్ లో అందరికీ తెలుసనీ ఇప్పుడుతనని చులకనగా చూస్తారని చెప్పితల్లిదండ్రులని పంపించేసింది.
“పడ్డ (పడేసుకున్న) చోటేవెతుక్కోవాలని”, తనకి ఇంతకు ముందుదారి చూపించిన ఒకనాటి సిల్క్ స్మిత, ఫటాఫట్ జయలక్ష్మి, సంధ్యా రాణి, నేటిఉదయకిరణ్, విజయ సాయి లాగాజీవితాన్ని అంతం చేసుకుంది.