జీవుల్లో రంగులు ఎందుకు !!!?:-ప్రతాప్ కౌటిళ్యాMSc(Bio-chem) M tech (Bio-Tech)

 ఈ సృష్టిలో ఏదైనా నా పదార్థం నుంచి ఏర్పడినదే, అంతేకాదు ఈ భూమి మీద ఉన్న గాలి నీరు సూర్యరశ్మి వల్ల ప్రాణం పుట్టింది. ప్రాణు లన్నింటికి మూలంపదార్థం కాంతి నీరు ఆధారం అని గుర్తుంచుకోవాలి. ప్రాణులుపుట్టక ముందు నుంచి పదార్థం ఉంది అందువల్లపదార్థ ధర్మాన్ని ప్రాణులు కలిగి ఉంటాయని గమనించాలి.
భూమి మీద ఉన్న ప్రాణులు రకరకాలుగా ఉన్నాయి ఎన్నో జీవజాతులు గా మన గలుగుతున్నాయి దీనికి కారణం జీవపరిణామ మేనని మనకు తెలుసు
కానీ ఈ జీవుల లోఇన్ని రంగులు ఎందుకు అసలు జీవులకు మొక్కలకు రంగులతో పనేంటి అసలు రంగులను ఎవరు చూడాలని అవి ఏర్పరచుకున్నాయి !?
ఈ ప్రశ్నలకు సమాధానం పదార్థ ధర్మం వల్ల రంగులు ఏర్పడ్డాయని చెప్తున్నాం అసలు జీవుల్లో కళ్ళు ఉన్నా, కళ్ళులేని మొక్కల్లో కూడా రంగులు ఏర్పడి ఉన్నాయి. కళ్ళు ఏర్పడక పూర్వం కూడా భూమి మీద రంగులు ఉన్నాయి ఎందుకంటే కాంతి కిరణము ఏడు రంగులు ఉండటం వలన భూమి మీద ఉన్న పదార్థం అంతా కూడా జీవుల లో కూడా రకరకాల రంగులు చూడగలుగుతున్నాం అంతేకానీ ప్రత్యేకంగా ప్రాణం ఉన్న వాటికి రంగులు ఉన్నాయని కాదు అలాగే మొక్కలకు కల్లు లేవు కానీ రంగులు ఉన్నాయి ఎందుకు ఇదంతా జరిగిందంటే ఇవి అన్నీ కూడా ప్రకృతిలోని పదార్థం నుంచి పుట్టాయి కాబట్టి అదికూడా కళ్ళు ఉన్న మనం కాంతి వల్ల చూడ గలుగు తున్నాము.
కాంతిలో ఏడు రంగులు వాటీ మిశ్రమాల వల్ల రకరకాల రంగులను మనం భూమి మీద చూడగలుగుతున్నాం కాకపోతే జీవుల్లోరంగులుఎందుకు ఏర్పడ్డాయి
. అన్న దానికి సమాధానం మనుగడకోసం ప్రకృతిలో ఆహారం రక్షణ మరియు ప్రత్యుత్పత్తి కోసం అవీఆయా మార్పులను ఆపాదించునుకుని రంగులు ఏర్పడ్డాయని చెప్తున్నాం కానీ పదార్థ ధర్మం వల్లనేరంగులు ఏర్పడ్డాయని తెలుసుకోవడంతో పాటు భూమి మీద కళ్ళు లేని జీవం పుట్టక ముందు నుంచి కూడా రకరకాల రంగుల జీవులు ఉన్నాయి అని గమనించాలి.
కళ్ళు ఏర్పడ్డాక నే మనం గాని వేరే జీవులు కానీ ఆ రంగులను చూడగలుగుతున్నాం దీనికి కారణం కాంతి లోని కొంతభాగం పదార్థం పీల్చుకొని ఆపదార్థధర్మం ప్రకారం మిగతా కాంతిని బయటకు వదిలివేయడం వలన మనం పదార్థంలో కానీ జీవులలో కానీ రంగులను చూడగలుగుతున్నాం. దీన్నిజీవులు అనువంశికంగా కొనసాగిస్తున్నాయి.
అందుకే ఇంత వింత వింత రంగుల్లో జీవులు ఏర్పడడానికి కారణం పరిస్థితులు, పరిసరాలు ప్రకృతి ,పదార్థం కారణం అని తెలుసుకోవాలి అంతేకానీ కళ్ళు కారణం కాదు !?
ప్రతాప్ కౌటిళ్యా
       Asst professor in Bio-Chem
                       Retd