ఆర్వీయం Sunshine-6: -----ఝాన్సీ.కొప్పిశెట్టి --ఆస్ట్రేలియా


 నీటి టబ్బులో స్నానాల గదిలో

నీళ్ళతో నీ తప్పట్ల కేరింతలు

ప్రామ్ లో విహారాల వేళ

కదిలిపోయే కొమ్మల వంక నీ అబ్బురపు చూపులు..!


ప్రతీదీ చోద్యoగా నువ్వు శోధిస్తుంటే

పిల్లగాలులు పిల్లనగ్రోవి ఊదుతూ

పూబాలలు మత్తిల్లి తలలు ఊపుతూ

పరవశాన ప్రకృతి నాట్యమాడుతూ..!


నిత్యం నన్నంటిపెట్టుకుని స్పర్శించే నువ్వు

స్లీప్ అండ్ సెటిల్ ప్రోగ్రామంటూ వెళ్ళావు

మూడు రాత్రుల వియోగమనుకున్నానే గాని

నీ పడక గది ప్రత్యేకమవుతుందనుకోలేదు..!


---------------------------------

ఫోటో లో : బేబీ ఆర్వీ సంధు.