కులుకుల కలికితురాయి లేకనా భుజమిప్పుడు బోసి పోయింది
ఆర్మీ ట్రైనింగుని మించిన నీకిచ్చిన శిక్షణకు
ఈ ఆర్మీ అమ్మమ్మ విస్తుపోయింది
ఇప్పుడిక బేబీ మానిటరే తోడయ్యింది..!
అర్ధరాత్రి నీకు డ్రీమ్ ఫీడట
నేను దొంగ పిల్లిలా నిన్ను చేరాలట
నీ కళ్లబడకుండా నక్కి పాలు పట్టాలట
అప్పుడు నువ్వు నవ్వితే అంజాన్ కొట్టాలట..!
నీ నవ్వుకి స్పందించకుండా నిలవరించుకోవటం
ఎంత కష్టమో బంగారూ ఎవరికి విన్నవించుకోను
అసలు కన్నా వడ్డీ ముద్దని ఎలా నచ్చచెప్పను
చక్కదనాల చక్ర వడ్డీ మరీ ముద్దని ఎలా చెప్పను..!
----------------------------------------------------
ఫొటోలో.....బేబీ ఆర్వీ సంధు.
ఆర్వీయం Sunshine-7:------ఝాన్సీ.కొప్పిశెట్టి.--ఆస్ట్రేలియా